వసుచరిత్రము
వసుచరిత్రము ఆంధ్రప్రబంధాలలో ఉత్తమోత్తమమైనది. నాకు అత్యంతప్రీతిపాత్ర మైనది. అష్టదిగ్గజాలలో సుప్రసిద్ధుడైన రామరాజభూషణుడు ఈ గ్రంథకర్త. ఈ మహాప్రబంధాన్ని అర్థతాత్పర్యవివరణలతో, అనేకానేకపండితవిమర్శనలతో సమగ్రంగా ఇక్కడ కూర్పుచేసి ఉంచవలెనని నా ఆశయము. ఇది బృహత్తరకార్య మగుటవల్ల పూర్తిచేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. అందుచేత కూర్పుచేసిన భాగాలను కూర్పుచేసినట్లుగా ఇక్కడ ఉంచుతాను. కావ్యంలోని వివిధభాగాలను నేరుగా ప్రదర్శించేందుకుగాను ఆయాభాగాల అనుపథాలను (Links) పైన సూచించినాను. వీనిపై మీ మూషికాన్ని (Mouse) నొక్కితే మీకు నేరుగా ఆయాభాగాలు కన్పడుతాయి(సూచన: ఈ పేజీఇంకా నిర్మాణంలో ఉంది).